A 25-year-old woman software engineer was lost life while crossing the road at busy Pension Office junction at Road No.1 and 12, Banjara Hills on Wednesday. Sirisha was working at SpinSci located on Road No. 12 in Banjara Hills as a software engineer
బంజారాహిల్స్‌లోని పింఛన్ ఆఫీస్ వద్ద మృతి చెందిన మహిళా టెక్కీ శిరీష ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. కాగా బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో మహిళా టెక్కీ బుధవారం దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. బస్సు డ్రైవర్ చేసిన తప్పుకు ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. గాజుల రామారానికి చెందిన ఇరవై అయిదేళ్ల శిరీష బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని స్పిన్‌ఎస్‌సీఐ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులో వచ్చారు. బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీస్ చౌరస్తా దిగారు. రోడ్డు దాటుతుండగా మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది.
అక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎస్సై దయాకర్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఆర్టీసీ డ్రైవర్ తొందరపాటు వల్ల ఆమె మృతి చెందినట్లుగా చెబుతున్నారు. రోడ్డు సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా బస్సును నిర్లక్ష్యంగా నడిపారని చెబుతున్నారు. దానికి తోడు టెక్కీ శిరీష తన చెవిలో ఇయర్ ఫోన్స్ కిందపడిన ఆమె పై నుంచి బస్సు ముందు చక్రం వెళ్లడంతో అక్కడికి అక్కడే మృతి చెందారు. మృతి చెందిన శిరీష నాలుగు నెలల గర్భిణీ.